
మౌన మోహన సింగ్
మంత్రుల అవినీతి తంత్రాల మసిబూసి
జంకుగొంకులు లేక బొంకు పలికి
అవినీతి సచివుపై ఆంక్షలు విధియింప
సంకీర్ణ ధర్మంబు సాకు జూపు
సీవిసి థామస్‌ను సేవలో నియమించి
మకిల వర్తన పైన మాటమార్చు
పదవియే ధ్యేయమై పలురోత పనులను
కనుగప్పి, నేర్పుతో కతలు జెప్పు
మంత్రి వర్గపు స్పూర్తిని మంట గలిపి
ఆత్మ సాక్షిని అధినేత్రి కప్పజెప్పి
నాయకీమణి సేవలో నలిగి తనియు
మన్మనోహను మౌనంబు మనల ముంచె
Like this:
Be the first to like this post.
This entry was posted on ఏప్రియల్ 12, 2011 at 5:06 పూర్వాహ్నం and is filed under Uncategorized. You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.